Tuesday, 3 November 2026

వినాయక పండగలోనూ పర్యావరణ పరమార్థం

అందుకు అనుగుణంగా ముందుకు సాగాలి

హైదరాబాద్‌,సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి): చెరువుల్లో మట్టిని తవ్వి తీసుకుని వచ్చి వినాయకుడిగా చేసి, మళ్లీ చెరువలోనే పూజించిన పత్రీపూలతో నిమజ్జనం చేయడం వెనక శాస్త్రీయత ఉంది. మట్టిని తీసి మళ్లీ అది ఎరువుగా, చెరువు నీరు కాలుష్యరహితంగా కావడానికి జరిగే ప్రక్రియ ఇందులో ఇమిడి ఉంది. మంనం పూజించే మారేడు, ఉత్తరుణి వంటివి ఔషధ గుణాలు కలిగి ఉండడం వల్ల్నీటిని కాలుష్యం నుంచి కాపాడుతాయి. అందుకే వినాయకచవితి ఎన్నో ప్రత్యేకతలు కలిగిన పర్వదినంగా చూడాలని పలవుఉరు పర్యావరణవేత్తలు సూచించారు. మన పండగలన్నీ ప్రకృతి ఆరాధనతో మమేకమై వుంటాయి.వినాయకచవితి పర్వదినంలో మనం అనేక పుష్పాలు, ఫలాలతో స్వామిని పూజిస్తాం. విఘ్నాలను నివారించే వినాయకుని పూజతో మనం పండగను జరుపుకొంటాం. ఏటా కొన్ని వేల గణపతి విగ్రహాలను రంగులతో అలంకరించి మండపాల్లో ఏర్పాటుచేయడాన్ని చూస్తుంటాం. అలాగే ప్రతిఇంట్లో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి పూజ నిర్వహిస్తాం. వీటిని మట్టితో తయారుచేస్తేనే మన పర్యావరణం కాపాడకున్నవారం అవుతాం. ఇటీవల కొంతకాలంగా విగ్రహాల తయారీలో ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ ప్యారిస్‌, రసాయనాలు కలిగిన రంగులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. వినాయక నిమజ్జనంతో ఈ రంగులు, ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో చెరువులు, కుంటలు, తటాకాలు, బావులు, నదులకు పర్యావరణ నష్టం జరుగుతోంది.ఈ జలాల్లో నివసించే అనేక జీవకోటి మనుగడకు విఘాతం ఏర్పడుతోంది. అలాగే నీరు కలుషితం అవుతోంది. దీంతో మల్లీ ఇది వాడడానికి వీలు లేకుండా హైదారాబాద్‌ హుస్సేన్‌ సాగర్‌లా కాలుష్య కాసారంగా మారుతున్నాయి. అందుకే ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను వాడాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. మట్టి గణపతులను తయారుచేయడం ద్వారా కొంతయినా పర్యావరణం కాపాడుకోగలం. ఇంట్లో పూజించే చిన్న చిన్న వినాయక విగ్రహాలను పూర్తిగా మట్టితో తయారుచేస్తే అవి పర్యావరణహితంగా వుంటాయి. నీటిలో సులభంగా కరిగిపోతాయి. ఎలాంటి రంగులను వాడకపోవడంతో నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉండదు. ఇక వీధుల్లో ప్రతిష్టించే పెద్ద విగ్రహాల తయారీలోనూ మట్టినీ, పర్యావరణ హితమైన రంగుల్నీ వాడటం ద్వారా పర్యావరణానికి మేలు చేయొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇటువంటి విగ్రహాల వల్ల నిమజ్జన సమయంలో జలాలు కలుషితం కావని చెబుతున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఈ వినాయకచవితి ఉత్సవాల సందర్భంగా స్వచ్ఛమైన ప్రకృతి కోసం కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంది. వినాయక మండపాల్లో ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలి. పెద్ద పెద్ద మండపాల వద్ద భారీ పరిమాణం కలిగిన ఆడియో సిస్టమ్‌లను పెట్టి శబ్ద కాలుష్యం కలిగించకుండా చూడాలి. పెద్ద పెద్ద చెరువులూ, తటాకాలూ, కుంటల్లో వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేసి పర్యావరణానాన్ని దెబ్బతీయవద్దని సూచిస్తున్నారు.ప్రతి ఒక్కరూ పర్యావరణానికి మద్దతుగా నిలవాలన్నారు. ఏటా నిమజ్జనాల కారణంగా చెరువులు కాలుష్య కాసారాలుగా మారుతున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.