|
విశాల్ మెగా మార్ట్ షోరూంను ప్రారంభించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ఎల్బీనగర్ (జనం సాక్షి ) వినియోగదారులకు అవసరమైన నాణ్యమైన వస్తువులను తక్కువ ధరల్లో అందించాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సూచించారు. ఎల్బీనగర్ నియోజకవర్గం కర్మన్ ఘాట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన విశాల్ మెగా మార్ట్ షోరూమ్ ను ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విశాల్ మెగా మార్ట్ షోరూం హైదరాబాదులో ఇది 15వ శాఖ అని, విశాల్ మెగా మార్ట్ మరిన్ని శాఖలను విస్తరించాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ దసరా, దీపావళి సందర్భంగా నాణ్యమైన వస్తువులపై పలు రకాల డిస్కౌంట్ లను ఇస్తూ విక్రయాలు జరుపుతున్నామని తెలిపారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో విక్రయాలు జరుపుతున్నామని వివరించారు. అంతకుముందు నిర్వాహకులు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని శాలువలతో, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో విశాల్ మెగా మార్ట్ నిర్వాహకులు డాక్టర్ రామచంద్రారెడ్డి, ఎన్.రాజశేఖర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, శ్యాంసుందర్, రాజేశ్వర్ రెడ్డి, హస్తినాపురం డివిజన్ తెరాస అధ్యక్షుడు ఆందోజు సత్యం చారి , టిఆర్ఎస్ నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Attachments area
|
వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి




