Wednesday, 4 November 2026

విమానం రద్దుతో అయ్యప్ప భక్తుల ఆందోళన

హైదరాబాద్‌,నవంబర్‌21 (జనం సాక్షి) : శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలువురు ప్రయాణికులు ఆందోళనకు దిగారు. అయ్యప్ప స్వామి దర్శనానికి శబరిమలకు వెళ్లేందుకు వారం రోజుల క్రితమే పలువురు ప్రయాణికులు టికెట్లు బుక్‌ చేసుకున్నారు. తీరా వీరు శబరిమల వెళ్లేందుకు గురువారం విమానాశ్రయానికి చేరుకున్నారు. కాగా ఆ విమానం రద్దు అయిందని సిబ్బంది పేర్కొంది. దీంతో ఎయిర్‌ ఇండియా తీరుపై ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎయిర్‌పోర్టులో ఆందోళన చేపట్టారు. తమకు సమాచారం ఇవ్వకుండానే విమానాన్ని రద్దు చేయడమే గాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.