వివోఏ ల సమస్యలు పరివివోఏ ల సమస్యలు పరిష్కరించాలిష్కరించాలి
ఝరాసంగం అక్టోబర్ 17 జనం సాక్షి వివోఏ ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వివోఏ లు సోమవారం ఝరాసంగం ఏపీఎం బాల కృష్ణ కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివోఏ ల కు కనీస వేతనం చెల్లించాలి అన్నారు. పెండింగ్ లో ఉన్న వేతనాలు ఇవ్వాలని కోరారు. వివోఏ లకు సెర్ప్ ఉద్యోగుల గా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివోఏ లు మహ్మద్, ఖాజా, సిద్దు,రాజు పటేల్ శిరోజోద్దీన్, నర్సిములు, రాజపతి,విజయకుమార్, పద్మమ్మ,నాగమణి,రాజు,వసంత సంధ్యారాణి, అనిత,సోపియోద్దీన్, రాజు,రాములు, వసంత తదితరులు పాల్గొన్నారు.