విశ్రాంతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా అలుగుబెల్లి లక్ష్మారెడ్డి
గరిడేపల్లి, జూలై 7 (జనం సాక్షి): రిటైర్డ్ ఉద్యోగుల సంఘం గరిడేపల్లి మండల నూతన అధ్యక్షునిగా 2022 నుంచి 2025 గాను అలుగుబెల్లి లక్ష్మారెడ్డి ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య, ఉపాధ్యక్షులు జూలకంటి నర్సిరెడ్డి ఎన్నికల అధికారిగా చెన్నా సోమయ్య బుధవారం ప్రకటించారు. నూతనంగా ఏర్పడిన గరిడేపల్లి యూనిట్ సభ్యులు అధ్యక్షులుగా అలుగుబెల్లి లక్ష్మారెడ్డి, కార్యదర్శులు మేళ్లచెరువు బిక్షమయ్య, ఆర్థిక కార్యదర్శిగా అలుగుబెల్లి కృష్ణారెడ్డి, అసోసియేట్ అధ్యక్షులుగా సుందరి సుధాకర్, ఉపాధ్యాయులుగా వెంగళ మల్లయ్య, ఉపాధ్యక్షురాలు బొల్లెపల్లి శేషమ్మ ,ఆర్గనైజేషన్ కార్యదర్శిగా వెంకటరెడ్డి, గోపగాని లలిత ప్రచార కార్యదర్శిగా బండ సత్యనారాయణ రెడ్డిలను ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రావెళ్ల సీతారామయ్య, జూలకంటి నర్సిరెడ్డి, హుజూర్నగర్ యూనిట్ కార్యదర్శి చెన్న సోమయ్య న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించినారు.