ఎల్బీ నగర్ (జనం సాక్షి ) ఎమ్ బి సీలకు కేటాయించే బడ్జెట్లో రూ. వెయ్యి కోట్లతో విశ్వకర్మ ఫెడరేషన్ కార్పోరేషన్కు కేటాయించాలని కోరుతూ గురువారం నాడు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్కుమార్ చేపడుతున్న ప్రజా సంగ్రామ యాత్రకు అఖిల భారత విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కౌలేజగన్నాథమ్ అధ్వర్యంలో గౌరవ అధ్యక్షులు తల్లోజు చేన్నయ్య ఆచారి, కోశాధికారి ఆవంచ మురళీధర్ చారి ,ప్రధాన కార్యదర్శి సంకోజు లింగాచారి లతో కలసి ప్రజా సంగ్రామ యాత్రకు సంఘీభావం తెలుపుతూ బండి సంజయ్ కుమార్ కి విశ్వ కర్మియులు ఎదుర్కొంటున్న సమస్యల పై వినతిపత్రం అందించారు .ఈ సందర్బంగా అఖిలభారత విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జగన్నాథం మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ కి పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించాలని కోరారు. వడ్రంగి వృత్తిదారుల పై జరుగుతున్న అటవీశాఖ అక్రమ దాడులను అరికట్టి 69 జీవోను రద్దు చేయాలని అదేవిధంగా ,స్వర్ణకారులపై జరుగుతున్నా పోలీసులు అక్రమ రికవరీలను అరికట్టి జి ఒ 272 ను సవరణ చేసి వెంటనే అమలు చేయాలని , .జనాభా ప్రాతిపదికన సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో న్యాయమైన వాటా ఇవ్వాలని వినతిపత్రంలో వివరిం చారు..నామినేటెడ్ పదవులలో విశ్వకర్మలకు సముచిత స్థానం కల్పించాలని అన్నారు
విశ్వకర్మీయులు ఎదుర్కొంటున్న సమస్యలపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి వినతిపత్రం అందజేసిన : కౌలే జగన్నాథం




