విశ్వబ్రాహ్మణ జర్నలిస్టుల కుటుంబాలకు భరోసాగా నిలవాలి
విశ్వబ్రాహ్మణ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు తూములూరి సత్యనారాయణ
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): విశ్వ బ్రాహ్మణ జర్నలిస్టులు ప్రతి విశ్వ బ్రాహ్మణ జర్నలిస్ట్ కుటుంబానికి భరోసాగా నిలవాలని విశ్వబ్రాహ్మణ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు తూములూరి సత్యనారాయణ అన్నారు.బుధవారం స్థానిక జనగాం క్రాస్ రోడ్డులో గల సంగీత్ ఫంక్షన్ హాల్ లో జరిగిన ఆ సంఘ జిల్లా స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.విశ్వబ్రాహ్మణ జర్నలిస్టులు ఐకమత్యంతో పని చేయాలని సూచించారు.నాణ్యమైన విద్య , వైద్యం ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేయాలని కోరారు.అనంతరం ఆ సంఘ సూర్యాపేట జిల్లా అధ్యక్షులుగా మడూరి బ్రహ్మచారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా బ్రహ్మచారి మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ జర్నలిస్టుల సంఘం బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో తాడోజు వాణిశ్రీకాంత్ రాజ్ , రంగు దిలీప్ , దారోజు జానకిరాములు , తౌడోజు శైలేంద్రాచారి , శ్రీపాద భాస్కరాచారి, సూర్యాపేట మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చౌడోజు సాంబాచారి , వంగాల వెంకటాచారి, నాగార్జునపు రామాచారి, శ్రీనివాసాచారి , వీరాచారి, గౌరోజు అశోక్ , బాణాల విజయ్ కుమార్ , పాండురంగాచారి, సొల్లేటి ఉపేంద్రాచారి తదితరులు పాల్గొన్నారు.