విశ్వ గురువుగా భారత్..
దేశ కీర్తి కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రధాని మోడీ
-బిజెపి నాయకులు గంట రవికుమార్
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 17(జనం సాక్షి)
విశ్వగురువుగా భారతదేశానికి కీర్తి తీసుకురావడానికి ధృడ సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పంబూని, 140 కోట్ల భారతీయుల ఉన్నతికై కంకణం కట్టుకున్నారని వరంగల్ తూర్పు బిజేపి నేత గంట రవి కుమార్ అన్నారు. మోదీ జన్మదినం పురస్కరించుకుని శనివారం వేడుకలు నిర్వహించారు.
33వ డివిజన్ లో జిల్లా బిజెపి ట్రేడర్స్ కో- కన్వీనర్ చిలువేరు రాజేందర్ ఆధ్వర్యంలో జరిగిన నరేంద్రమోదీ జన్మదిన వేడుకల్లో పాల్గొని గంట రవికుమార్ మాట్లాడారు.
పేదరికం, అవినీతి, ఉగ్రవాదం వంటి పీడల నుంచి విముక్తి పొందిన నవభారత నిర్మాణానికై యజ్ఞం చేస్తున్న భరతమాత ముద్దుబిడ మోడీ అని కొనియాడారు..
అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, జిల్లా పదాదికారులు, డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థులు, డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Attachments area
|