విస్తృతంగా మండలంలో పర్యటించిన జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య

– అంతర్గత రహదారులకు నిధులు కేటాయిస్తా
— పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలన
–టేకులపల్లి,గోలియా తండా, కుంటల్ల గ్రామాలలో పర్యటించిన జడ్పీ చైర్మన్

టేకులపల్లి,అక్టోబర్ 15( జనం సాక్షి): నియోజకవర్గంలోని టేకులపల్లి మండలంలోనిగోలియా తండా,టేకులపల్లి, కుంటల గ్రామపంచాయతీలలో శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య విస్తృతంగా పర్యటించారు. గోలియా తండాలోని అంతర్గత రహదారులను కలియతిరిగారు. పొలాలకు వెళ్లే రహదారిని పరిశీలించిన చైర్మన్ కు రైతులు రహదారిలో బ్రిడ్జి నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. అంతర్గత రహదారులకు, బ్రిడ్జి నిర్మాణానికి నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. తరువాత గోలియా తండాలో, టేకులపల్లి లో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు తయారుచేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఆహారాన్ని పరిశుభ్రంగా తయారు విద్యార్థులకు మంచి భోజనాన్ని పెట్టాలనిసూచించారు. పాఠశాలలో ఏర్పాటుచేసిన పేరెంట్స్ కమిటీ సమావేశంలో పాల్గొని పదవ తరగతి విద్యార్థులతో విద్యాబోధనపై ముచ్చటించారు. అనంతరం కుంటల గ్రామంలో అనారోగ్యంతో కిచ్చడి మంగయ్య మృతి చెందడంతో సందర్శించివారి కుటుంబాన్ని పరామర్శించారు. మొకం పాడు తండా గ్రామంలో బానోతు చంద్యా ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం సర్పంచులు, ముఖ్య నాయకులతో గ్రామాలలో నెలకొని ఉన్న సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు బోడా నీరోషా, యదళ్ళపల్లి బాబు, బానోత్ విజయ, మోకాళ్ళ రమాదేవి,వార్డు మెంబర్లు అనంతుల వెంకన్న,మూడ్ శాంతి, మాలోత్ హంకీ,నాయకులు కోరం సురేందర్, బోడ మంగీలాల్ నాయక్, ఈది గణేష్,మోకాళ్ళ పోషాలు, బానోత్ భద్రు, బానోత్ రవి, చందర్ సింగ్ రాథోడ్,భూక్యా సర్దార్,గడ్�