Thursday, 5 November 2026

చిన్న రామచర్లలో మహిళపై కొండెంగ దాడి

అటవీశాఖ అధికారులు స్పందించాలి
బచ్చన్నపేట అక్టోబర్ 15 (జనం సాక్షి) మండలంలోని చిన్న రామ చర్ల గ్రామంలో గత రెండు నెలలుగా కొండెంగా. వాహనదారులపై. వృద్ధులపై. పిల్లలపై. దాడులు చేస్తూ గాయపరుస్తుందని దీంతో ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఒక్క గంటలో ఇద్దరు వ్యక్తులపై దూకి పడేయ గా.తలకు చేతులకు కాళ్లకు గాయాలు అయ్యాయని. చేతిలో కర్ర లేకుండా ప్రజలు బయటికి రావాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వస్తున్నారని సిపిఎం జనగామ జిల్లా కార్యవర్గ సభ్యులు గొల్లపల్లి బాపిరెడ్డి అన్నారు. తక్షణమే అటవీ శాఖ అధికారులు స్పందించి కొండెంగను పట్టుకోవాలని ఫారెస్ట్ అధికారులకు విన్నవించారు