హైదరాబాద్,ఆగస్ట్6(జనం సాక్షి ): బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత విూడియాపై నిర్బంధం పెరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతారావు అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం కొరవడిందని.. ప్రజాభాగస్వామ్యం లేకుండానే ప్రభుత్వం పని చేస్తోందని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్ పార్టీకి సంబంధించిన బీసీ నేతలు రిజర్వేషన్లపై కేసీఆర్‌ను నిలదీయాలని అన్నారు. కాగా తెలంగాణలో పర్యటించనున్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన సందర్భంగా సర్పంచులను కలుస్తారని వీహెచ్ తెలిపారు.




