Monday, 2 November 2026

విూసేవ బంద్‌ లేదు..

– బంద్‌ను వాయిదా వేస్తున్నాం

– విూసేవ సంఘం అధ్యక్షుడు జీవన్‌
హైదరాబాద్‌, అక్టోబర్‌31(జ‌నంసాక్షి) : ముందు ప్రకటించినట్లుగా రేపటి నుంచి విూసేవ బంద్‌ లేదని, విూసేవ కార్యాలయాలు యధావిధిగా కొనసాగుతాయని తెలంగాణ విూసేవ సంఘం అధ్యక్షుడు జీవన్‌ ప్రసాద్‌ ప్రకటించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్నందునే బంద్‌ను వాయిదా వేస్తున్నట్లు జీవన్‌ వివరించారు. ఇప్పటికే అనేక సమస్యలు పరిష్కారం అయ్యాయని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని సమస్యలపై దృష్టి పెడుదామని, సమస్యలను పరిష్కరించుకుందాం అని జీవన్‌ పిలుపునిచ్చారు. అవసరమైతే మరో రెండు గంటలు అదనంగా విూసేవ సెంటర్లను నడుపుతామని ప్రకటించారు. సమ్మెలో తాము పాల్గొనడం లేదని స్పష్టం చేశారు. కాగా, తమ సమస్యల పరిష్కారం విషయమై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిశామని, ఎన్నికల తరువాత మాట్లాడుతామని సీఎస్‌ చెప్పినట్లు జీవన్‌ తెలిపారు. ఈ కారణంగానే తాము ఇప్పుడు సమ్మెకు దిగడం సరికాదని జీవన్‌ పేర్కొన్నారు.