Tuesday, 3 November 2026

వి ఆర్ ఏ ల డిమాండ్లు నెరవేర్చకుంటే ఉద్యమం ఉదృతం చేస్తాం 

బీఎస్పీ ఖేడ్ ఇంచార్జి అలిగే జీవన్ కుమార్
నారాయణఖేడ్ జులై30(జనంసాక్షి)
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నగల్ గిద్ద మండలంలో గ్రామ రెవెన్యూ అసిస్టెంట్లు తలపెట్టిన నిరసన సమ్మె 6 వ రోజు నాగిల్ గిద్ద మండలం లో మద్దతు తెలిపిన బహుజన సమాజ్ పార్టీ నారాయణఖేడ్ నియోజకవర్గ ఇంచార్జి అలిగే జీవన్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వి ఆర్ ఏ ల డిమాండ్లకు బీఎస్పీ తరపున సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని, వి ఆర్ ఏ లకు పే స్కెల్ జీ ఓ విడుదల చేయాలని, పదోన్నతులు కల్పించాలని,55 సం రాలు పూర్తయిన వారికి వారి వారసులకు స్థానం కల్పించాలని ,వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమం ఉదృతం చేస్తామని కేసీఆర్ ప్రభుత్వాన్నీ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నాగిల్ గిద్ద విఆర్ఏల అధ్యక్షుడు మల్లప్ప, ఉపాధ్యక్షుడు రమేష్,బీఎస్పీ నాగిల్ గిద్ద సీనియర్ నాయకులు శంకర్, జగన్ ఇబ్రహీం, శాంతకుమార్, అంబావ్వ, ముజియ బేగం, వివిధ గ్రామాల నుంచి తదితరులు పాల్గొన్నారు.