Tuesday, 3 November 2026

స్టడీ ఫెయిర్‌ 2022ను నిర్వహించిన గ్లోబల్‌ ట్రీ

ఖైరతాబాద్ 30 జూలై (జనం సాక్షి)  అంతర్జాతీయ విద్యా సేవలలో అగ్రగామి సంస్థలలో ఒకటైన గ్లోబల్‌ ట్రీ ఇప్పుడు ఒన్‌ స్టాప్‌ షాప్‌ పరిష్కారాలను అంతర్జాతీయ కెరీర్‌ ప్రణాళికల కోసం అందిస్తూ  హైదరాబాద్‌లో స్టడీ ఫెయిర్‌ 2022 ను శనివారం బంజారా హిల్స్ ఓ హోటల్లో నిర్వహించింది. ఈ స్టడీఫెయిర్‌ 2022ను విదేశాలలో విద్యనభ్యసించాలనుకునే విద్యార్థులకు తగిన మార్గనిర్దేశకత్వం చేయడంతో పాటుగా వారికి సహాయపడే రీతిలో నిర్వహించారు. గ్లోబల్‌ ట్రీ స్టడీ ఫెయిర్‌ 2022లో యుకె, ఆస్ట్రేలియాలకు చెందిన 40 అత్యుత్తమ యూనివర్శిటీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ఎడిషన్‌ స్టడీ ఫెయిర్‌ ద్వారా పలు యూనివర్శిటీలలో ఫాల్‌ బ్యాచ్‌ 2022 లేదా స్ర్పింగ్‌ బ్యాచ్‌ 2023 అడ్మిషన్లను నిర్వహించనున్నారు. ఈ స్టడీ ఫెయిర్‌ 2022ను కాలిజియేట్‌ ఎడ్యుకేషన్‌ మరియు టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిధులుగా కాన్సులేట్‌ ఆఫ్‌ కింగ్‌డమ్‌ ఆఫ్‌ లెసోథో సూరత్‌ సింగ్‌మల్హొత్రా, రచయిత, కవి, మీడియా కన్సల్టెంట్‌ ఆలపాటి లక్ష్మీ నారాయణతో పాటు గ్లోబల్‌ ట్రీ సీనియర్‌ లీడర్‌షిప్‌ బృందం(ఎస్‌ఎల్‌టీ) పాల్గొన్నారు. గ్లోబల్‌ ట్రీ కెరీర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఫౌండర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీకర్‌ ఆలపాటి మాట్లాడుతూ..  కరోనా మహమ్మారి అనంతర కాలంలో తల్లిదండ్రులతో పాటుగా విద్యార్థులు సైతం విదేశీ విద్య పట్ల పూర్తిగా డైలమాలో ఉన్నారన్నారు. కానీ గ్లోబల్‌ ట్రీ మాత్రం వారికి మృదువైన, సౌకర్యవంతమైన అడ్మిషన్‌ ప్రక్రియను అంతర్జాతీయ విద్యా సంస్థలలో అందించడంతో పాటుగా విద్యార్థులు ఆహ్లాదకరమైన రీతిలో దానిని పూర్తి చేసేందుకు తోడ్పడుతుందన్నారు. గత 15 సంవత్సరాల ప్రయాణంలో, గ్లోబల్‌ ట్రీ వేలాది మంది విద్యార్థులకు మరియు ప్రొఫెషనల్స్‌కు తమ కెరీర్‌ లక్ష్యాలను సాధించేందుకు ప్రొఫెషనల్‌, సమగ్రమైన విధానంతో సంపూర్ణమైన వ్యక్తిగతీకరించిన సేవలను అందించడం ద్వారా తోడ్పడుతుందన్నారు.