వీఆర్ఏలకు ఆర్థిక సాయం చేసిన స్థానిక తహసీల్దార్ జి రమేష్ బాబు

పెద్దవంగర అక్టోబర్ 01(జనం సాక్షి ) మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం లో వీఆర్ఏలు కు గత రెండు నెలల నుండి నిరవధిక సమ్మె లో భాగంగా శనివారం స్థానిక తహసిల్దార్  జి రమేష్ బాబు,వీఆర్ఏల కు   ఆర్థిక పరిస్థితి మరియు దసరా పండగను దృష్టిలో పెట్టుకొని 10000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ గణేష్,ఆర్ ఐ లస్కర్, జూనియర్ అసిస్టెంట్ శ్రీష,స్వరూప, వి ఆర్ ఏ లు వేణు, బాలరాజు, నాగరాజు, సతీష్, యాకయ్య, అంజయ్య, సోమయ్య, వెంకటయ్య, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు