వీఆర్ఏలకు పే స్కేల్ ప్రకారం జీతం ఇవ్వాలి:

కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు వేములకొండ పుల్లయ్య
తిరుమలగిరి (సాగర్), సెప్టెంబరు 14 (జనంసాక్షి): వీఆర్ఏలకు పే ఆప్ స్కేల్ ప్రకారం జీతం ఇవ్వాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు వేములకొండ పుల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బుధవారం స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ ముందు వీఆర్ఏల నిరవధిక సమ్మెకు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా  మాట్లాడుతూ వీఆర్ఏల సమ్మె బుధవారంతో 43వ రోజు పూర్తి చేసుకున్నారని వారి సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపకపోవడం  ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. అర్హత కలిగిన ప్రతి వీఆర్ఏకు ప్రమోషన్లు కల్పించాలని 55 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అన్నారు.  ఉద్యోగ భద్రత కల్పించి డబల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
 ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సంఘం తిరుమలగిరి (సాగర్) మండల అధ్యక్షుడు కుర్ర రాజు నాయక్, లక్ష్మీకాంత్ రెడ్డి వీఆర్ఏ లు సత్రశాల నరసింహ తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్: వీఆర్ఏల సమ్మెకు మద్దతు తెలుపుతూ మాట్లాడుతున్న వేములకొండ పుల్లయ్య