Wednesday, 4 November 2026

వీఆర్ఏలకు పే స్కేల్ వర్తింప చేసి ప్రభుత్వ ఉద్యోగా గుర్తించాలి కన్నెకంటి వెంకటేశ్వర చారి

రామన్నపేట ఆగస్టు 30 (జనంసాక్షి) వీఆర్ఏలకు పే స్కేలు వర్తింపజేసి ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలని బిజెపి జిల్లా నాయకులు మాజీ ఎంపిటిసి సింగిల్ విండో డైరెక్టర్ కన్నెకంటి వెంకటేశ్వర చారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రామన్నపేట మండలం గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న సమ్మె 37వ రోజు వీఆర్ఏల దీక్ష శిబిరాన్ని  కన్నెకంటి వెంకటేశ్వర చారి సందర్శించి వారికి సంఘీభావం తెలియజేశారు. అదేవిధంగా వారికి మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేసి స్వయంగా వడ్డించారు. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వీఆర్ఏల కోరికలు న్యాయమైనవని ప్రభుత్వం వారి కోరికలను అమలు చేసి వారికి తక్షణం పే స్కేలు వర్తింపచేయాలని అన్నారు. వారు సమ్మెలో ఉండడం వల్ల తహసిల్దార్ కార్యాలయంలో పలు రకాల సేవలు నిలిచిపోయాయని వారి అవసరం ఎంతైనా ఉందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల మండల అధ్యక్షులు ఎడ్ల వెంకన్న, కార్యదర్శి మాదాసు నరసింహ, మండల కో కన్వీనర్ దంతాల వెంకన్న, సహాయ కార్యదర్శి రాములు, ముత్యాలు కమిటీ సభ్యులు ఎండి బాబు, లక్ష్మయ్య, యాదగిరి ,పిచ్చయ్య ,రమేష్ ,తిరుపతి, పూజ, అండాలు తదితరులు పాల్గొన్నారు.