మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్సీ సిరికొండ .

చిట్యాల 30(జనంసాక్షి)మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను మంగళవారం తెలంగాణ తొలి శాసనసభాపతి, ఎమ్మెల్సీ  సిరికొండ మధుసూదనా చారి పరామర్శించి, పలువురికి ఆర్థిక సహాయం అందించి ఓదార్చారు. బాధిత నిరుపేద కుటుంబాలకు అన్నివిధాలుగా అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. మండలంలోని జడల్పేట గ్రామంలో ఇటీవల మరణించిన నల్ల సమ్మిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, గాంధీనగర్ లో మృతి చెందిన బొట్ల రాజ పోచయ్య  కుటుంబాన్ని,  రత్న మహేందర్ కుటుంబాన్ని, చల్లగరిగ గ్రామం లో మృతి చెందిన  ఇంజ పెళ్లి సమ్మయ్య కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. అనుకోని విధంగా  కుటుంబసభ్యులు మృతి చెందడం బాధాకరమైన విషయమే అయినప్పటికీ మీరంతా ధైర్యంగా ఉండాలని మృతుల కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు చింతల రమేష్, కర్రే అశోక్ రెడ్డి, కాట్రేవుల సాయిలు, లెక్కల రాజు రెడ్డి రంజిత్, కన్నెబోయిన అశోక్, యం డి  రబ్బానీ, నోముల  నాగరాజు, కురిమిళ్ల కుమారస్వామి, పో రెడ్డి సుదర్శన్ రెడ్డి, జంబుల చంద్ర మొగిలి, కంది మాధవరెడ్డి, నైన్ పాక ఎంపీటీసీ కట్టె కోళ్ల రమేష్, లక్ష్మీపూర్ తండా సర్పంచ్ జవహర్లాల్, నాయకులు దొడ్డ శంకర్  మేదరి రామచందర్, జాలిగపు కిష్టయ్య  ఉప్పల కిరణ్, రాయిని శ్రీకాంత్ కోడల రాజమల్లు మోత్కూరి బాలకృష్ణ ధరావత్ రాజు టిఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు మల్లక్క, పుష్పక్క,  బొట్ల రవి, గణపతి గుజ్జ భీమ్రావు, అజ్మీరా  రవి, విష్ణువర్ధన్,  పుల్లూరి నారాయణ రావు, మహేందర్, అనిల్, సాయి తదితరులు పాల్గొన్నారు.