Thursday, 5 November 2026

వీఆర్ఏల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి

 

 

 

 

 

*ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ ఆరెల్లి మల్లేష్ మాదిగ
బజార్ హత్నూర్ (జనం సాక్షి): వీఆర్ఏల న్యాయబద్ధమైన డిమాండ్లను ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ ఆరెల్లి మల్లేష్ మాదిగ డిమాండ్ చేశారు బజార్ హత్నూర్ మండల కేంద్రంలో వీఆర్ఏ జేఏసీ అధ్యక్షులు బొమ్మేత రమేష్ ఆధ్వర్యంలో 41 రోజులుగా జరుగుతున్న నిరవధిక దీక్షలను అభినందిస్తూ ఎమ్మార్పీఎస్ తరపున మద్దతు ప్రకటిస్తూ డిమాండ్ పరిష్కరించాలని ఎమ్మార్వో కి వినతి పత్రం ఇచ్చారు అనంతరం ఆయన మాట్లాడుతూ వీఆర్ఏలకు పే స్కేల్ జీవోను వెంటనే అమలు చేయాలని అర్హులైన వారికి ప్రమోషన్స్ కల్పించాలని, 55 సంవత్సరాలు పైబడిన వారి స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని మరణించిన వీఆర్ఏల స్థానంలో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చి ఇప్పుడు దానిని అమలు చేయడంలో నిర్లక్ష్యం చేయడం దారుణంగా భావిస్తున్నాం అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకొని వీఆర్ఏల డిమాండ్లను పరిష్కరించాలని లేనిపక్షంలో వీరి నాయబద్ధమైనటువంటి డిమాండ్లకు ఎమ్మార్పీఎస్ పూర్తిస్థాయిలో అండగా ఉంటూ వీఆర్ఏల డిమాండ్ సాధించుకునే వరకు అండగా ఉంటామని తెలిపారు కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా కోకన్వీనర్ బరుకుంట సుభాష్ మాదిగ ఎంఎస్ఎఫ్ జిల్లా పసుల శ్రీకాంత్ రాజు సుభాష్ తదితరులు పాల్గొన్నారు