వీఆర్ఏల డిమాండ్స్ తక్షణమే నెరవేర్చాలి ! వై ఎస్ ఆర్ టి పి భూపాల పల్లి జిల్లా అధ్యక్షులు అప్పం కిష
: భూపాలపల్లి ప్రతినిధి సెప్టెంబర్ 3 జనం సాక్షి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండల కేంద్రంలో వీఆర్ఏలు చేపట్టిన ధర్నా కార్యక్రమంలో శనివారం ఆయన పాల్గొని వారికి మద్దతు తెలియజేసిన వైయస్సార్ టిపి జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు అప్పం కిషన్. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని లేనిపక్షంలో అసెంబ్లీ ని ముట్టడిస్తామని కిషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీఆర్ఏలకు పే స్కే అమలు చేస్తామని, 55 సంవత్సరాలు దాటిన వారి వారసులకు ఉద్యో గాలు ఇస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు స్పందన లేదన్నారు. ముఖ్యమంత్రి హామీ అమలు కై వీఆర్ఏలు గత 41 రోజులుగా చేపట్టిన నిరావధిక సమ్మె చేస్తున్నారని, ప్రభుత్వం ఏమి పట్టనట్టుగా వ్యవహరిస్తూ వారిని ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఆయన మండిపడ్డారు. నేడు జరిగే కేబినెట్ సమావేశంలో వారి సమస్యలపై నిర్ణయం తీసుకోవాలని, స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అసెంబ్లీలో మాట్లాడాలని లేని పక్షంలో వీఆర్ఏలతో కలిసి ఉద్యమానికి ఉధృతం చేసి అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైయస్సార్ టిపి మండల నాయకులు రాజేందర్, శ్రీనివాస్, పవన్ ,రమేష్ ,తిరుపతి లతోపాటు వీఆర్ఏల సంఘం గణపురం మండల అధ్యక్షులు సమ్మయ్య వీఆర్ఏలు చేరాలు ,తిరుపతి, భద్రయ్య ,సురేందర్, స్వప్న, మమత, రవి తదితరులు పాల్గొన్నారు.