వీఆర్ఏల నిరసన ర్యాలీ

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వీఆర్ఏల రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు వీఆర్ఏలు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం నాటికి 23వ రోజుకు చేరుకుంది.ఈ సమ్మెలో భాగంగా పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆ సంఘ నాయకులు మాట్లాడుతూ వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.అర్హత కలిగిన వీఆర్ఏలకు పదోన్నతులను కల్పించాలన్నారు.55 సంవత్సరాల దాటిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో వీఆర్ఏల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మీసాల సునీల్ గవాస్కర్, నాయకులు మహమ్మద్ రఫీ, అక్కినపల్లి శ్రీను, నరసయ్య, మామిడి సైదులు, తండు నగేష్ , సంతోష్ రెడ్డి , మాధవి , అజార్, అజయ్ , శ్రీను, రూపాదేవి, రాజ్యలక్ష్మి , లక్ష్మమ్మ , నస్రిన్ , జానీ తదితరులు పాల్గొన్నారు.