వీఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలి.
సమ్మెకు సిపిఎం మద్దతు…
* పోరాటాలతో ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలి :జులకంటి
మిర్యాలగూడ. జనం సాక్షి
వీఆర్ఏ ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని వీఆర్ఏలు చేపట్టిన సమ్మె శుక్రవారం ఐదో రోజుకు చేరుకున్నాయి సమ్మెలో భాగంగా వీఆర్ఏలు నల్ల బ్యాడ్జీలు మూతికి కట్టుకొని నిరసన తెలిపారు ఈ సమ్మెకు సిపిఎం నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వీఆర్ఏల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి విస్మరిస్తున్నారని విమర్శించారు తక్షణమే హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రవ్యాప్తంగా 23 వేల మంది వీఆర్ఏలు పనిచేస్తున్నారని, వారిని పర్మినెంట్ చేసి ఆదుకోవాలని కోరారు. అర్హతబట్టి పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. 55 సంవత్సరాలు నిండిన వీఆర్ఏలను విరమణ ఇచ్చి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశము కల్పించాలని డిమాండ్ చేశారు ఈ విషయంపై ముఖ్యమంత్రికు లేఖ రాయనున్నట్లు తెలిపారు. సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు, తమ డిమాండ్లు నెరవేరేంతవరకు బలమైన పోరాటాలు చేయాలని దీనికి సిపిఎం ఎప్పుడు మద్దతిస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నాయకులు డబ్బికార్ మల్లేష్, సీఐటీయూ నాయకులు డా.మల్లు గౌతమ్ రెడ్డి,రవినైక్ తిరుపతి రామ్మూర్తి, ఆర్.పరుశురాములు, రాగిరెడ్డి మంగా రెడ్డి, ఆయూబ్, పాపిరెడ్డి, కోడైరెక్క మల్లయ్య, పిల్లుట్ల సైదులు, గాయం రమణ రెడ్డి, బి వెంకటయ్య, రామరావు, విఆర్ఏ సంఘం నాయకులు సురేష్, సైదులు, బాషా, సరిత, శిరీష తదితరులు పాల్గొన్నారు.
Attachments area