Wednesday, 4 November 2026

*వీఆర్ఏల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా- ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి*

పెద్దేముల్ సెప్టెంబర్ 12 (జనంసాక్షి)
వీఆర్ఏల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పెద్దేముల్ మండల వీఆర్ఏలకు హామీ ఇచ్చారు.సోమవారం నాడు పెద్దేముల్ మండల వీఆర్ఏలు హైదరాబాద్ లో ఎమ్మెల్సీ నివాసంలో కలిసి తమ సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారించే విధంగా కృషి చేయాలని కోరారు.అందుకు వారి సమస్యలను విన్న ఎమ్మెల్సీ సానుకూలంగా స్పందించి, వీఆర్ఏల సమస్యల పరిష్కారం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తప్పకుండా మీ సమస్యలు తొందర్లోనే పరిష్కారమవుతాయని,తను కూడా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో పెద్దేముల్ మండల వీఆర్ఏలు పాల్గొన్నారు.
Attachments area