సీఎం కెసిఆర్ పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం

బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు వీరబోయిన లింగయ్య
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి ): రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి బీసీలకు తీవ్ర  అన్యాయం జరుగుతుందని బీసీ విద్యార్థి సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు వీరబోయిన లింగయ్య విమర్శించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బీసీ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.తాజాగా పోలీస్ నియామకాల నోటిఫికేషన్ లో రిజర్వేషన్ల విషయంలో బీసీలకు జరుగుతున్న తీవ్ర అన్యాయంపై బీసీ ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడకపోవడం దారుణమన్నారు.రాష్ట్రంలో 55 శాతం బీసీలున్నారని పేర్కొన్నారు. బీసీ అభ్యర్థులకు కానిస్టేబుల్ నియామక ప్రాథమిక పరీక్షలో  కటాప్ మార్కులు తగ్గించకపోతే త్వరలో బీసీ మంత్రులు , ఎంపీలు, ఎమ్మెల్యేల ఇండ్లని ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ సమావేశంలో ఒర్సు గణేష్, సిద్ధూ , వినయ్ , వంశీ , చింటూ, శ్రవణ్ , మధు , సాయి, శివ శంకర్ ,అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area