వీఆర్ఏల సమ్మెకు మద్దతు తెలిపిన బిఎస్పి నాయకులు
ఎల్లారెడ్డి జులై ( జనంసాక్షి ) తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని తహసిల్ కార్యాలయం ముందు చేస్తున్న వీఆర్ఏ ల నిరవధిక సమ్మెకు సోమవారం నాడు బహుజన సమాజ్ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బిఎస్పి నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం వీఆర్ఏలకు హామీలు ఇచ్చి మోసం చేసిందని, వారికి పే స్కేల్ అమలు చేయాలని,ఉద్యోగ భద్రత పదవి విరమణ తర్వాత పింఛన్ సౌకర్యం కల్పించాలని వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఎస్పి అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి బిమరి భాస్కర్,కోశాధికారి కడిగే రాజు, ఎల్లారెడ్డి పట్టణ అధ్యక్షులు మర్లు సాయిబాబా, నవీన్ vra లు శ్రీనివాస్ కాశీరాజు వేంకట్ సుమన్ వీనోద్ లు తదితరులు పాల్గొన్నారు.