మల్దకల్ ఆగస్టు1 (జనంసాక్షి) తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పిన వాగ్దానాలు నిలబెట్టుకోవాలని,గత ఎనిమిది రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్న వీఆర్ఏలకు అండగా ఉంటామని,కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పటేల్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మల్దకల్ మండల కేంద్రాలలో వీఆర్ఏదీక్ష సోమవారం కేంద్రాలలో సంఘీభావం తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ పార్టీ నాయకులు బల్గెర నారాయణ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వీరబాబు,మల్దకల్ మండల అధ్యక్షులు నల్లారెడ్డి, గట్టు మండల అధ్యక్షులు గౌస్, సర్పంచ్ గీత నాయుడు,జిల్లా కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ చీఫ్ ఆర్గనైజర్ ,సోషల్ మీడియా కోఆర్డినేటర్ జమాల్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రఘునాయుడు,మురళి,రాజు కార్యకర్తలు పాల్గొన్నారు.




