వీఆర్ఏ లను అదుపులో తీసుకున్న పోలీసులు
టేకులపల్లి, సెప్టెంబర్ 13( జనం సాక్షి): అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్ళనీయకుండా వీఆర్ఏలను టేకులపల్లి పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఉపాధ్యాయులు, వీఆర్ఏల సమస్యలపై అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని పురస్కరించుకొని వెళ్లడానికి సిద్ధమవుతున్న వారిని ఆ సంఘ నాయకులను ముందస్తుగా పోలీసుల అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు.
అక్రమంగా అరెస్టు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం: పి వై ఎల్ డివిజన్ కార్యదర్శి నోముల బాలచందర్ మాట్లాడుతూ ఉపాధ్యాయ సంఘాలు వీఆర్ఏలు వారి న్యాయమైన సమస్యలపై శాంతియుతంగా చేపట్టే కార్యక్రమాలను అడ్డుకోవడం సరి అయింది కాదన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వారి న్యాయమైన సమస్యల పట్ల స్పందించి పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.