వీఆర్ఏ లపై ప్రభుత్వానికి చిన్నచూపు తగదు
– న్యూ డెమోక్రసీ నాయకులు నోముల భానుచందర్
టేకులపల్లి, సెప్టెంబర్ 5( జనం సాక్షి): 43 రోజులుగా నిరవధిక సమ్మె కొనసాగిస్తున్న వీఆర్ఏల పట్ల ప్రభుత్వానికి చిన్న చూపు తగదని న్యూ డెమోక్రసీ నాయకులు, పి వై ఎల్ కొత్తగూడెం డివిజన్ కార్యదర్శి నోముల భానుచందర్ అన్నారు. వీఆర్ఏల నిరవధిక సమ్మె కు ఆయన మద్దతు తెలుపుతూ ఈ సందర్భంగా మాట్లాడారు. వీఆర్ఏలు చాలీచాలని జీతాలతో కుటుంబ పోషణలకు ఎన్నో ఇబ్బందులకు గురవుతూ న్యాయమైన డిమాండ్స్ పై చేస్తున్న నిరవధిక సమ్మెపై ప్రభుత్వం ఎలాంటి స్పందన చూపకపోవడం చాలా విచారకరమన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ 9-9-2020 నాడు అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు ప్రకటించిన పే-స్కేలు జీవోను విడుదల చేసి వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా అర్హతలు కలిగిన వీఆర్ఏలకు పదోన్నతులు కల్పించాలని, 55 సంవత్సరాలు నిండిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, వారికి పెన్షన్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు.