*వీఆర్ఏ ల సమస్యలు పరిష్కరించాలి.
* మండల అధ్యక్షులు ప్రేమ్ కుమార్.
చిట్యాల జులై (జనంసాక్షి) వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వీఆర్ఏల మండల అధ్యక్షులు ప్రేమ్ కుమార్ అన్నారు. ఈమేరకు మంగళవారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నిరవధిక సమ్మె రెండవ రోజుకు చేరుకోగా బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు పాలెపు రాంబాబు, మాజీ జెడ్పిటిసి కాట్రేవుల సాయిలు సంఘీభావం తెలిపారు.అనంతరం వీఆర్ఏ జేఏసీ చైర్మన్ పకిడె రాజయ్య, మండల అధ్యక్షులు ప్రేమ్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ విఆర్ఎల కు పే స్కేల్ వర్తింపు చేయాలని, 55 సంవత్సరాల పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు కల్పించాలి. అలాగే సొంత గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ల వంటి హామీలు ఇచ్చి ఆరు సంవత్సరాలు గడిచినా ఇప్పటివరకు అమలు కాలేదని, ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే రాబోయే రోజులలో వీఆర్ఏలు ఉద్యమం ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి దబ్బెట రాజు, సహాయ కార్యదర్శి వేణు వంక రమనాచారి, భోగం సాంబయ్య, సరస్వతి ,సురేష్, సదయ్య, ఆనందం, లక్ష్మయ్య, రాజు, చిరంజీవి, కృష్ణ ,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Attachments area