వెంకటాపూర్ లో బతుకమ్మ చీరల పంపిణీ

వెంకటాపూర్ (రామప్ప) జనం సాక్షి : మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభమైంది మండలానికి 9946 బతుకమ్మ చీరలు రాగా తహసీల్దార్ పి మంజుల ఆధ్వర్యంలో లాంఛనంగా ప్రారంభించారు ముఖ్య అతిథులుగా హాజరైన జెడ్పీటీసీ గై రుద్రమదేవి ఎంపీపీ బుర్ర రజిత లు పాల్గొన్నారు ముఖ్య అతిథులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ మహిళలకు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు మండలంలోని మహిళలందరూ బతుకమ్మ పండుగను స్వేచ్ఛాయుత వాతావరణంలో ఆనందంగా జరుపుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మెడవేని అశోక్ ఎంపీటీసీలు కో ఆప్షన్ మెంబర్ తదితరులు పాల్గొన్నారు