మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
మోత్కూర్ సెప్టెంబర్ 22 జనంసాక్షి : మండలంలోని దాచారం గ్రామానికి చెందిన అన్నారపు యాదగిరి (61) అనారోగ్యంతో గురువారం మరణించడంతో మృతుని కుటుంబానికి సింగిల్ విండో డైరెక్టర్, సర్దార్ సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆకుల వెంకటేశ్వర్లు రూ.5 వేలు ఆర్థిక సాయం అందించి మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ అన్నారపు అంజయ్య, బోళ్ల హనుమంతు,వార్డు మెంబర్ సూరారం బుచ్చయ్య ,సూరారం స్వామి ,సూరారం యాదయ్య ,ముంత సురేష్ ,ఎస్ఎంసి చైర్మన్ భీమనబోయిన అవిలయ్య, తదితరులు పాల్గొన్నారు.