వెంకట్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అద్దంకి దయాకర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి — కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షుడు ఫైళ్ల సోమిరెడ్డి

మోత్కూరు ఆగస్టు 6 జనంసాక్షి :
మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చండూరు మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై అద్దంకి దయాకర్ మాట్లాడినటువంటి మాటలకు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని మోత్కూర్ మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఫైళ్ల సోమిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని పార్టీ నుండి వెళ్లిపో అనే స్థాయి అద్దంకి దయాకర్ కు లేదని వెంటనే క్షమాపణ చెప్పాలని హెచ్చరిస్తున్నమన్నరు. అద్దంకి దయాకర్ రెండుసార్లు నీకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే గెలిచిన పాపాన పోనీ వ్యక్తివి నువ్వు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద నువ్వు మాట్లాడడం, ఉంటే ఉండు పోతే పో ఎంతవరకు సమంజసం, అద్దంకి దయాకర్ మీరు పార్టీ లో ఉండి చేసింది ఏముంది ఏనాడైనా నియోజకవర్గంలో తిరిగావా కార్యకర్తల సమస్యలు తెలుసుకున్నవా బహిరంగ సభలో టీవీల ముందు ఇస్టమ్ వచ్చినట్టు మాట్లాడం కాదు ప్రజా క్షేత్రం లో ఉండి ప్రజల సమస్యలపై పోరాటం చేయి…మీరు చేసిన వ్యాఖ్యలకు కోమటిరెడ్డి కి వెంటనే క్షమాపణ చెప్పాలని లేని పక్షాన నియోజకవర్గ ప్రజలు మీకు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరింస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ మహమ్మద్ ఆయాజ్, మండల కాంగ్రెస్ నాయకులు కొప్పుల కరుణాకర్ రెడ్డి, తీగల నరసింహారెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కారు పోతుల వెంకన్న గౌడ్ యూత్,కాంగ్రెస్ టౌన్ అధ్యక్షులు కొనతం నరేందర్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ నాయకులు కాషామేని మహేందర్,ఎండి బాబర్,కాశమేని రవికుమార్, చిప్పలపల్లి రమేష్,నిమ్మల రమేష్ తదితరులు పాల్గొన్నారు.