వేముల జడ్.పి.హెచ్.ఎస్ పిఈటి బషీర్ అహ్మద్ సస్పెండ్ చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి

గద్వాల నడిగడ్డ, జులై 20 (జనం సాక్షి);
జోగులంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వేముల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుడు బషీర్ అహ్మద్ ను ఈనెల 19న సస్పెండ్ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సిరాజుద్దీన్ తెలిపారు. పాఠశాలకు సక్రమంగా హాజరు కాకపోవడంతో గ్రామస్తులు, కొంతమంది ఫిర్యాదు చేయడంతో సస్పెన్షన్ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. మండలంలోని పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయుడు, మరో ప్రధానోపాధ్యాయుడికి మెమొలు జారీ చేసినట్లు సమాచారం