వేయి నామాలవాడికి సహస్రనామార్చన
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):స్థానిక వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శనివారం ఆలయ ప్రధాన అర్చకులు నల్లన్ చక్రవర్తుల వేణుగోపాలచార్యులు ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృతాలతో తిరుమంజనం నిర్వహించారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వేయి నామాలతో సహస్రనామార్చన నిర్వహించారు.శనివారం కావడంతో గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి ఏరువ శ్రీనివాసరెడ్డి , బజ్జూరి కృష్ణయ్య , రవీందర్, శ్రీనివాస్, కరుణాసాగర్ రెడ్డి, మంజుల, జ్ఞాన కుమారి, వాసవి, లక్ష్మి , రజిత, సుభాషిని, ఆండాళ్ గోష్ఠి భక్త బృందం తదితరులు పాల్గొన్నారు.