వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందజేత

సూర్యాపేట ( జనంసాక్షి) :రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాల స్ఫూర్తితో  పేదలకు తనవంతు సహాయం చేస్తున్నట్లు టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు గండూరి కృపాకర్ బుధవారం అన్నారు.కరోనా సమయంలో అనేక మందికి నిత్యావసర వస్తువులు, బియ్యం, పంపిణీ చేసినట్లు చెప్పారు.పేద విద్యార్థులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం పలువురు విద్యార్థులకు తనవంతుగా ఆర్దిక సహాయం అందించానని చెప్పారు.జిల్లా కేంద్రంలోని 47వ వార్డుకు చెందిన
చెరకు నాగలక్ష్మి గత కొంత కాలం నుండి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ హైదరాబాదులోని నందమూరి బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్నట్లు చెప్పారు.నాగలక్ష్మి కుటుంబం  ఆర్దికంగా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని 47వ వార్డు టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రేణు బాబు తెలుపగా, ఆమె ఇంటికి వెళ్ళి వైద్య  చికిత్స కోసం రూ. 10 వేలు ఆర్దిక సహాయం అందించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో శశి కుమార్, శ్రీను, మహేష్, పవన్, సంతోష్, నజీర్, సాయి కుమార్, వివేక్, బాచి, అభినయ్, రాహుల్   తదితరులు పాల్గొన్నారు.
Attachments area