కాలేయ క్యాన్సర్ విద్యార్థి అలంకృత కు తోటి విద్యార్థుల సహాయం.

 ఏర్గట్ల సెప్టెంబర్ 14 ( జనంసాక్షి ): నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలోని నలంద స్కూల్ లో చదువుతున్నా విద్యార్థి అలంకృత కాలేయ క్యాన్సర్ తో బాధపడుతు చికిత్సకొరకు ముంబయి హాస్పిటల్ వెళ్లుచున్నదని తెలిసి తోటి విద్యార్థులు, ఉపాధ్యాయలు చందలు వేసికొని బుధవారం ఐదు వేల ఒక వంద రూపాయలు, అలాగే యాజమాన్యం కూడా 2500 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తు సంపూర్ణ ఆరోగ్యం తో తిరిగి వస్తుందని తల్లిదండ్రులకు ధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం లో కోరస్పాండంట్ వెంకటగౌడ్, ఉపాధ్యాయులు  సుదర్శన్, మమత, శ్వేతలు పాల్గొన్నారు.
Attachments area