Wednesday, 4 November 2026

వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు

(జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ శుక్రవారం)శ్రీ కృష్ణుని జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని  జోగిపేట ఇండియన్ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో  కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణ, గోపికల వేషధారణతొ విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఉట్టికొట్టే కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. పోటీ పడి రాధాకృష్ణులు పెరుగుతో కూడిన కుండని పగలగొట్టారు.కార్యక్రమంలో  విద్యార్థులు దేశ సంస్కృతి, సంప్రదాయాల ను మరవకూడదని ప్రిన్సిపాల్ జైన్ సూచించారు. విద్యార్థి దశ నుంచే గీతా శ్లోకాలను పఠించాలని పేర్కొన్నారు. కరస్పాండెంట్ ఎండి గౌస్ అల్లరివాడు, గోపికాలోలుడు, యశోద తనయుడు, యోగీశ్వరుడని పేరొందిన శ్రీకృష్ణుని జన్మదిన ఉత్సవాలను ఆనవాయితీగా పాఠశాలలో జరుపుతున్నట్లు తెలిపారు. కులమతాలకు అతీతంగా పాఠశాలల్లో అన్ని పండుగలను జరుపుటకు సహకరిస్తున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధె లక్ష్యంగా పాఠశాలలను నడుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు మానస లక్ష్మీ ప్రసన్న కీర్తన ఫరీదా మేడం స్రవంతి గాయత్రి ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.