వైయస్ షర్మిల పాదయాత్రను అడ్డుకొని అరెస్ట్ చేయడం పిరికిపంద చర్య వికారాబాద్ కోఆర్డినేటర్ ఉప్పరి ప్రసాద్
వికారాబాద్ రూరల్ ఫిబ్రవరి 20 జనం సాక్షి
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైయస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర ను అడ్డుకొని అరెస్టు చేయడం పిరికిపంద చర్య అని వైయస్సార్ తెలంగాణ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఉప్పరి ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో మహిళ నేతలతో కలిసి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అరెస్టుకు నిరసనగా వికారాబాద్ జిల్లా పొదుపు సంఘాల అధ్యక్షులు వికారాబాద్ రైతు బజార్ రోడ్ లో ధర్నా చేయడం జరిగింది అందుకు ప్రభుత్వాన్ని నిలదీస్తూ షర్మిలమ్మ ఒక మహిళ అయ్యుండి రాజన్న ఆశయాల కోసం ఎండనక వాన వెనక కుటుంబాన్ని వదిలి ప్రజల కష్ట సుఖాలను చూస్తూ 3800 కిలోమీటర్లు తెలంగాణ అంత తిరిగిన ఒక మహిళను అరెస్టు చేయడం సిగ్గుచేటని ఈ అరెస్టులకు త్వరలో మూల్యం చెల్లించక తప్పదని సీనియర్ నాయకురాలు రజిని పొదుపు సంఘాల జిల్లా అధ్యక్షురాలు ఉప్పరి పద్మ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఖండించడం జరిగింది ఈ కార్యక్రమంలో వికారాబాద్ మండలం వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి జిల్లా వైయస్సార్ తెలంగాణ పార్టీ అధికార ప్రతినిధి కావలి వసంత కుమార్ పొదుపు సంఘాల మహిళలు వైయస్సార్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు