వైశ్య ఫెడరేషన్ అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార 2.61.000 రుపాయలకు లడ్డు కైవసం.
తాండూరు సెప్టెంబర్ 4 (జనం సాక్షి) గత ఐదు రోజులుగా విశేష పూజలు అందుకున్న విగ్నేశ్వరుని ప్రసాదం(లడ్డు) వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్ 261,000 కు వేలంపాటలో దక్కించుకున్నారు. ఆదివారం తాండూరు పట్టణంలో వినాయక నిమజ్జ నోత్సవం సందర్భంగా పట్టణంలోని కుమార్ షాపింగ్ మాల్ ప్రాంతంలో ప్రతిష్టాపించిన వినాయక మండపంలో వినాయకుని చేతిలో ఏర్పాటు చేసిన లడ్డును వేలంపాట నిర్వహించారు. ఈ వేలం పాటలో వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్ 261,000 కు లడ్డూను కైవసం చేసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదిదేవుని ఆశీస్సులతో మహా ప్రసాదం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు.
గణనాథుని ప్రసాదం లభించడం ఎన్నో జన్మల పుణ్యఫలం అని వెల్లడించారు.అనంతరం వినాయక శోభయాత్రలో పాల్గొని చిందులేశారు