వై యస్ ఆర్ తెలంగాణ పార్టీ మండల అధ్యక్షుడిగా కంది శ్రీనివాస్ నియామకం

జనంసాక్షిచిగురుమామిడి-ఆగష్టు11:

వైయస్సార్ తెలంగాణ పార్టీ మండల అధ్యక్షుడిగా మండలంలోని సుందరగిరి గ్రామానికి చెందిన కంది శ్రీనివాసును నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు కుమార్ గురువారం తెలిపారు.ఈ సందర్భంగా కంది శ్రీనివాస్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో తనను మండల అధ్యక్షుడిగా నియమించిన జిల్లా అధ్యక్షుడికి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.చిగురుమామిడి మండలంలో పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూనే మాజీ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధన కృషి చేస్తానని తెలిపారు.రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా తమ పార్టీ ఆధునికరి వైఎస్ షర్మిల అక్కను గెలిపించుకునేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.కంది శ్రీనివాస్ నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.