వ్యవసాయ బోరు నుండి పైకి ఉబికి వస్తున్న నీరు…
బయ్యారం,జులై17(జనంసాక్షి):
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం లింగగిరి గ్రామంలో వ్యవసాయ బోరుబావి నుండి పైపుల ద్వారా నీరు పైకి ఉబికి వస్తుంది. వర్స నర్సయ్య, పూనెం బిక్షం అనే ఇద్దరు రైతుల పొలంలోని బోరు బావి పైపులనుండి ఆదివారం నీరు బయటకు వస్తుండడంతో గ్రామస్తులు, రైతులు అక్కడకి వచ్చి చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు.కాగా గత 10 రోజుల నుండి కురుస్తున్న వర్షాల కారణంగా అధిక వర్షపాతంతో భూమిలోని నీటి సాంద్రత పెరిగి ఒత్తిడికి గురై ఇలా వచ్చే అవకాశం ఉంది
.