వ్యవసాయ మార్కెట్లో 50 కేజీల బస్తా అమలు చేయాలి
.
సూర్యాపేట (జనంసాక్షి): తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ లో గత కొన్ని సంవత్సరాల నుండి హమాలీలుగా పనిచేస్తున్న హమాలీలకు ఇప్పటికీ 65 కేజీల ధాన్యం బస్తా కొనుగోలు నడుస్తుందని, తక్షణమే ఐకెపి సివిల్ సప్లై కేంద్రంలో మాదిరిగా 40 కేజీల లేదా 50 కేజీల బస్తాలు అమలు చేయాలని బహుజన కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి గాజుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు.గురువారం ఆ సంఘ నాయకులు కలెక్టరేట్ లో ఏఓకు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు రామచంద్రు , కార్యదర్శి సిహెచ్ యాదగిరి , మాణిక్యరావు , పరశురాములు , యాదగిరి , నరసయ్య , సైదులు, తదితరులు పాల్గొన్నారు.