సంగారెడ్డి,సెప్టెంబర్24 జనం సాక్షి : మునిపల్లి మండలం బుదేరా వద్ద జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదం సంభవించింది. బుదేరా శివారులో వ్యాన్ ఢీకొని ఇద్దరు టోల్‌ఫ్లాజా కార్మికులు మృతి చెందారు. మృతులను జగన్, రాములుగా పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వ్యాన్ ఢీకొని ఇద్దరు టోల్ ఫ్లాజా కార్మికులు మృతి




