విద్యుత్ కొరత రాకుండా ప్రణాళిక: మంత్రి
హైదరాబాద్,నవంబర్7(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం దాదాపు రెండేళ్ళ క్రితం చేపట్టిన మిషన్ భగీరథ పనుఉల శరవవేగంగా సాగుతున్నాయి. ఈ పథకం ఈ డిజెంబర్ నాటికి అమల్లోకి తేవాలన్న సంకల్పంతో సాగుతోంది. సిఎం కెసిఆర్ దేశాల మేరకు ప్రతి జిల్లాలో పనులు జోరుగా సాగుతున్నాయి. అనుకున్న సమయానికి వీటిని పూర్తి చేసి తెలంగాణ ప్ర.జలకు మంచినీటి కష్టాలు తీరుస్తామని సిఎం కెసిఆర్ ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న 31జిల్లాల్లో రక్షిత తాగునీరు అందించే ఉద్దేశ్యంతో చేపట్టిన మిషన్ భగీరథ పనులు యుద్ధప్రతిపాదికన సాగుతున్నాయి. వివిధ ప్యాకేజీల క్రింద జిల్లాల్లో మొత్తం దాదాపు 50వేల కిలోవిూటర్ల పైపులైన్లతో తాగునీరు అందించాలనేది లక్ష్యం. దాదాపు 50శాతం పైప్‌లైన్ పనులు పూర్తి కావచ్చాయి. తెలంగాణలో వరంగల్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో వివిధ ప్యాకేజీల క్రింద సమగ్ర తాగునీటి పథకాలను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పనులు పూర్తిచేయాలనేది లక్ష్యం కాగా ప్రధానమైన పనులు ఎప్పుడో పూర్తయిపోయాయి. ఇప్పటికే అత్యధిక ప్రాంతాల్లో నీటి సరఫరా ప్రారంభమైంది.ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ప్రధాని మోడీ ఈ పథకాన్ని లాంఛనంగా పైలాన్ ఆవిష్కరించారు. ఈ నియోజకవర్గంలో తాగు నీటి సరఫరా ఇప్పటికే పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చింది. ఇంట్రా పైపులైన్ల నిర్మాణం దాదాపు పూర్తికావచ్చింది. గజ్వేల్‌లో 2016ఆగష్టు 7వ తేదిన ప్రధాని నరేంద్ర మోడి చేతుల విూదుగా ఈ పథకాన్ని ప్రారంభించారు. దీనిని నిర్ణీత గడువుకంటే ముందే పూర్తి చేసారు. ఈ నియోజకవర్గంలో 67వేల మంది ప్రజలకు తాగునీరు అందించే విధంగా 1200 కిలోవిూటర్ల పొడవునా పైపులైన్లు వేయటం పూర్తిచేసింది. ఈ పథకం గజ్వేల్ ప్రాంతంలో వాడుకలోకి వచ్చి ఇప్పటికే ఏడాది కాలం పూర్తయింది. తెలంగాణ ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని మిషన్ భగీరథను చేపట్టారు. రాష్ట్రం మొత్తం విూద 459మండలాల్లోని 20558గ్రామాల్లోని 43లక్షల ఇళ్ళకు రక్షిత తాగునీరు అందించాలనేది లక్ష్యం. ఈ పథకాల్లో నీటి వనరు (ఇన్‌టేక్ వెల్) నుంచి పైపులైన్ల ద్వారా నీటిని ఓవర్‌హెడ్ ట్యాంకు లేదా రిజర్వాయర్‌కు తీసుకెళ్లి అక్కడి నుంచి వివిధ గ్రామాలకు ట్యాంకులు, పైప్‌లైన్ల ద్వారా నీటిని సరఫరా చేస్తారు. ఇందులో భాగంగా నీటి శుద్ధి ప్లాంట్‌లు, రిజర్వాయర్లు, ట్యాంకులు, ఇంటింటికీ కుళాయిలకు అవసరమైన ఇంట్రాపైప్‌లైన్ల నిర్మాణం పూర్తయ్యేవిధంగా అన్ని ప్యాకేజీల్లోనూ పనులు చురుగ్గా జరుగుతున్నాయి.అనుకున్న సమయానికి వీటిని పూర్తి చేయడంతో పాటు పథకానికి విద్యుత్ కొరత లేకుండా ప్రణాళిక సిద్దం చేశామని మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. అనుకున్న సమయానికి పనులు పూర్తవుతాయని అన్నారు.




