వేంపసల్లి నుంచి మొదలైన రొండోరోజు యాత్ర

పలకరింపులతో ముందుకు సాగిన జగన్‌

కడప,నవంబర్‌7(జ‌నంసాక్షి): ప్రజాసమస్యలను తెలుసుకుని తాను అధికారంలోనికి వచ్చాకా వాటిని పరిష్కరించాలన్న లక్ష్యంతోనే తాను ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్నానని వైకాపా అధినేత జగన్‌ అన్నారు. వేంపల్లి రోడ్డు నుంచి ఆయన పాదయాత్ర రెండో రోజు ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో అన్ని వర్గాల ప్రజలూ దగాపడ్డారని, అబద్ధపు వాగ్దానాలతో, అసత్య ప్రచారాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. అశేషంగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు వెంటరాగా ఈ ఉదయం 9 గంటలకు రెండోరోజు యాత్ర ఆరంభించారు. ఆయనతో ఫొటోలు దిగేందుకు, కరచాలనం చేసేందుకు అభిమానులు ఎగబడ్డారు. జననేతతో మాట్లాడేందుకు భారీగా జనం తరలివచ్చారు. వారందరినీ ఆయన పలకరించారు. వేంపల్లి క్రాస్‌ రోడ్డు, వైఎస్‌ కాలనీ, కడప-పులివెందుల హైవే, సర్వరాజపేట విూదుగా గాలేరు-నగరి కెనాల్‌ వరకు యాత్ర సాగనుంది. ఈరోజు 12.6 కిలోవిూటర్ల మేర వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేయనున్నారు. నీలతిమ్మాయిపల్లి సవిూపంలోని ఈరోజు యాత్రను ముగించనున్నారు. సోమవారం ఇడుపులపాయ నుంచి ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించిన జననేత మొదటిరోజు 8.9 కిలోవిూటర్లు నడిచారు. ఉదయం 9 గంటల 47 నిమిషాలకు తొలి అడుగు వేసిన ఆయన రాత్రి 6.40 గంటలకు బసకు చేరుకున్నారు.

తాజావార్తలు