హైదరాబాద్: ఓయూలోని ఆర్ట్స్ కళాశాల నుంచి గన్ పార్కు వరకు సంతోష్ అంతిమయాత్ర చేపడుతామని ఓయూ విద్యార్థులు తెలియజేశారు. ఆర్ట్స్ కళాశాల నుంచి గన్‌పార్కు వరకు శాంతియుత ర్యాలీకి అనుమతి ఇవ్వాలని విద్యార్థులు పోలీసులను కోరారు. సంతోష్ కుటుంబానికి రూ.10 లక్షలు చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సంతోష్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. సంతోష్ మృతదేహానికి ఓయూలోనే గాంధీ ఆస్పత్రి డాక్టర్లు పోస్టుమార్టుం నిర్వహిస్తున్నట్లు సమాచారం.




