శాంతి భద్రతలకు సంభందించి న బాధితులు తమ సమస్యలను నిర్భయంగా తెలియజేయండి -జిల్లా ఎస్పీ కె. సృజన.

గద్వాల నడిగడ్డ, జులై 24 (జనం సాక్షి);

శాంతి భద్రతలకు సంభందించి బాదితులు నిర్ణయంగా తమ సమస్యలను పోలీస్ అధికారులకు తెలియజేయాలని జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ కె.సృజన ప్రజావాణి కి వచ్చిన ప్రజలకు సూచించారు. సోమవారం ప్రజావాణి లో బాగంగా జిల్లా పోలీసు కార్యాలయంకు వచ్చిన 11 అర్జీలను జిల్లా ఎస్పీ స్వీకరించారు. వారి సమస్యలను విన్న జిల్లా ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులతో ప్రత్యక్షంగా వైర్లెస్ సెట్లో లో మాట్లాడి బాధితుల ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, సునిశితమైన అంశాలకు సంబంధించిన పిర్యాదుల విషయంలో కౌన్సిలింగ్ నిర్వహించాలని, భూములకు సంబంధించిన సివిల్ ఫిర్యాదులు కోర్టు ద్వారానే పరిష్కరించుకునేటట్లు పిర్యాదు దారులకు తెలియజేయాలని సూచించారు.

తాజావార్తలు