ఆర్యవైశ్యులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకోవాలి : తెలంగాణ సీనియర్ ఉద్యమకారుడు ప్రభు గుప్త

కంటోన్మెంట్ జనం సాక్షి జూలై 25 తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారులకు సరైన గుర్తింపు లభించినప్పుడే కేటీఆర్ జన్మదిన వేడుకలనుఅర్థం.ఆర్యవైశ్యులకు కార్పొరేషన్ ఏర్పాటుచేసి,పేదఆర్యవైశ్యులకు,ఉపాధి కల్పించి, కమిషన్ సభ్యులను నియమించాలని తెలంగాణ సీనియర్ ఉద్యమకారుడు ప్రభు గుప్తా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుడు ప్రభు గుప్తా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానం కలిగి ప్రత్యేక స్థానమని మలిదశ ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన అసలు సిసలుతెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా చేసిన జనహృదయనేత ఐటీ మరియు మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను కంటోన్మెంట్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇన్ చార్జీ మర్రి రాజశేఖర్ రెడ్డి కార్యాలయంలో జరుపుకున్నామన్ని ఆయన అన్నారు.ఐటి, మరియు మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలంగాణ ఉద్యమకారులకు సరైన గౌరవం ఇవ్వడం లేదని, ఈడబ్ల్యూఎస్ కోటాలో ఆర్యవైశ్యులు కూడా రిజర్వేషన్ కల్పించాలని ఆయనకోరారు. తెలంగాణ ఉద్యమకారులకు సరైన గౌరవం లభించినప్పుడే కేటీఆర్ జన్మదిన వేడుకలు అర్థం ఉంటుందని, కేటీఆర్ వచ్చే జన్మదిన వేడుకల వరకు ఆర్యవైశ్యులకు కమిషన్ సభ్యులు నియమించి, తెలంగాణ ఉద్యమకారులకు సరైన గుర్తింపు ఇస్తే, తెలంగాణలో ఇతర దేశాల్లో కూడా ఆర్యవైశ్యులు కనివిని ఎరగని రీతిలో జన్మదిన వేడుకలనుజరుపుకుంటామని ప్రభువు గుప్త అన్నారు.

తాజావార్తలు