శాంతి భద్రతలు కాపాడడానికే కాటన్ సెర్చ్ లు

కుబీర్ ఎస్సై ఎండి షరీఫ్
కుబీర్ ( జనం సాక్షి  30); నిర్మల్ జిల్లా పరిది లోని కుబీర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోనారి గ్రామంలో
నిర్మల్ జిల్లా S. P  శ్రీ  ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు  ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది.ఈ తనిఖీల్లో  S.I-4,  ASI/HC-8, PC- 35, స్పెషల్ పార్టీ సిబ్బంది  ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.
తనిఖీల్లో భాగంగా బృందాలుగా విడిపోయి పోలీస్ సిబ్బంది ప్రతి ఇంటినీ తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఎస్సై షరీఫ్ ప్రజలతో మాట్లాడుతూ…. ప్రజల రక్షణ గురించి ప్రజలకు భద్రత భావం కల్పించడం గురించి, ప్రజల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని, కాలనీ లో ఎవరైనా కొత్త వ్యక్తులు గాని, నేరస్తులు గాని వచ్చి షేల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని, నేర రహితంగా చేయాలని ఉద్దేశం గురించి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం ని నిర్వహించడం జరుగుతుందని తెలిపినారు. ప్రజలకు మేమున్నామని భరోసా భద్రత కల్పించడం అదేవిధంగా ఎలాంటి అభద్రతా భావం లేకుండా ఉండేందుకు ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటారని భరోసా, భద్రత, నమ్మకం కలిగించుట గురించి ఈ తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అలాగే నేర నియంత్రణ, చేదన లో సీసీ కెమెరాల ద్వారా సులభతరం అవుతుంది అని కావున ప్రతి కాలనీ లో సి.సి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలియజేశారు. అలాగే ఎమర్జెన్సీ సమయంలో గాని, ఏమైనా సమాచారం గానీ, పోలీసు వారి కి సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ తనిఖీల్లో  ఇళ్లను తనిఖీలు నిర్వహించారు. తనిఖీ లలో  సరైన ధ్రువపత్రాలు లేని 52 మోటార్ సైకిల్లు ,2 ఆటోలు సీజ్ చేయడం జరిగింది.అదేవిదంగా ఈ కాలనీలో వాహనాలు తనిఖీ చేసినప్పుడు చాలా వరకు రిజిస్ట్రేషన్ లేకుండా నెంబర్ ప్లేట్ సరిగా లేకుండా ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వారి యొక్క వాహనాలకు రిజిస్ట్రేషన్ , లైసెన్స్, ఇన్స్యూరెన్స్ కలిగి ఉండాలని తెలిపారు. ఎలాంటి పత్రాలు లేని వాహనాలు నడిపే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాత వాహనాలు కొనేటప్పుడు వాటి యొక్క డాక్యుమెంట్స్ చెక్ చేసుకుని లేని వాహనాలను కొనుగోలు చేయవద్దని తెలిపారు.ఈ కార్యక్రమంలో ల కుబీర్ సబ్ ఇన్స్పెక్టర్ ఎం.డి షరీఫ్,  య.సై లు శ్రీకాంత్, సుమంజలి, శశిధర్, కానిస్టేబుల్స్, మహిళా కానిస్టేబుల్ మొదలగు వారు పాల్గొన్నారు.

తాజావార్తలు