హైదరాబాద్,మే4(జనంసాక్షి): గ్రామ స్ధాయిలో వివిధ శాఖల మధ్య సమన్యయంతో పని చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయని సీఎస్ ఎస్కే జోషి అన్నారు. రాష్ట్రంలో కేంద్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పథకాల అమలుపై ఆయన సవిూక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో అంగన్ వాడీ కేంద్రాలలో తెలంగాణ ఫుడ్స్ తయారు చేసిన బాలామృతాన్ని అందిస్తున్నామని సి.యస్ వివరించారు. అంగన్‌వాడీలలో బాలల హాజరు సంఖ్య నమోదు చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్‌ను వినియోగించే విషయాన్నిపరిశీలించాలన్నారు. అంగన్ వాడీలు, ప్రాథమిక పాఠశాలల మధ్య అనుసంధానానికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా న్యూట్రీబాస్కెట్ ను అందిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పోషణ అభియాన్ పథకానికి సంబంధించిన నిధుల వినియోగ వివరాలు సమర్పిస్తామని, తగు సిబ్బందిని నియమిస్తామని, శిక్షణను అందిస్తామని అన్నారు.




